Amith shah: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పాతి పెడతాం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by vinod kumar |
Amith shah: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పాతి పెడతాం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ మళ్లీ ఎప్పటికీ ఎదగకుండా టెర్రరిజాన్ని పాతిపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం కిష్త్వార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదానికి మద్దతు పలికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ‘ఎన్నికల్లో గెలిస్తే ఉగ్రవాదులను విడుదల చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), కాంగ్రెస్‌లు హామీ ఇచ్చాయి. కానీ ప్రధాని మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నంత వరకు భారత గడ్డపై ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ఎవరూ సాహసించబోరు’ అని వ్యాఖ్యానించారు. టెర్రరిజం అనే మాట వినపడకుండా దానిని అంతం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుత జమ్మూ కశ్మీర్ ఎన్నికలు రెండు శక్తుల మధ్య జరుగుతున్నాయని..ఒకవైపు ఎన్సీ, కాంగ్రెస్ ఉంటే మరోవైపు బీజేపీ ఉందన్నారు. ఆర్టికల్ 370 పునరుద్దరిస్తామని ఈ రెండు పార్టీలు పదే పదే చెబుతున్నాయని, దానిని పునరుద్దరిస్తే పహాడీలు, గుజ్జర్లకు బీజేపీ ఇచ్చిన రిజర్వేషన్ ఇవ్వబోరని ఆరోపించారు. కశ్మీర్‌లో పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామని, కాంగ్రెస్, ఎన్సీ కూటమి జమ్మూ కశ్మీర్‌లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తెలిపారు. కశ్మీర్‌లో మోడీ రాజవంశ పాలనను అంతమొందించారని తెలిపారు. కాగా, ఈనెల 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో కశ్మీర్ లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed