- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Amith shah: మోడీ హయాంలోనే అసోంలో శాంతి.. కేంద్ర మంత్రి అమిత్ షా

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) నేతృత్వంలోనే అసోంలో శాంతి నెలకొందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అసోంను అల్లర్ల మంటల్లోకి నెట్టివేస్తే మోడీ శాంతిని పునరుద్దరించారని తెలిపారు. డెర్గావ్‌లోని లచిత్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ (Police academy)ని అమిత్ షా శనివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మోడీ ప్రభుత్వ హయాంలో తిరుగుబాటు గ్రూపులతో కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలు రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని నొక్కి చెప్పారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి అసోం, మేఘాలయ (Meghalaya), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) లతో అనేక ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు.
గత 10 పదేళ్లలో అసోంలో 10,000 మందికి పైగా యువత ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరారని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో శాంతి తిరిగి వచ్చిందన్నారు. ఒకప్పుడు అసోంలో చర్చలన్నీ ఆందోళన, కాల్పులు, తిరుగుబాటు చుట్టూ తిరిగేవని, కానీ ప్రస్తుతం రూ. 27,000 కోట్లతో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయబడుతోందని చెప్పారు. ఇది అసోం భవిష్యత్‌ను మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో, అసోంకు రూ. 1.27 లక్షల కోట్లు గ్రాంట్ అందుకుంటే పదేళ్ల మోడీ ప్రభుత్వ కాలంలో ఇది రూ. 4.95 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో ఏడు రోజులు జైలులో ఉన్నా
అసోంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనను తీవ్రంగా కొట్టారని, ఏడు రోజులు జైలులో నిర్భంధించారని చెప్పారు. రాష్ట్రంలో ఏనాడూ శాంతిని అనుమతించలేదని విమర్శించారు. హితేశ్వర్ సైకియా సీఎంగా ఉన్న టైంలో తనను జైలులో పెట్టారన్నారు. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి అసోంలో ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. ఈ టైంలోనే జైలులో పెట్టారన్నారు.
Read Also.. ముస్లింల రిజర్వేషన్ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం.. కోర్టుకు వెళతామని బీజేపీ ప్రకటన