Amith shah: సీఏఏతో లక్షలాది మందికి న్యాయం.. కేంద్ర మంత్రి అమిత్ షా

by vinod kumar |   ( Updated:2024-08-18 11:03:20.0  )
Amith shah: సీఏఏతో లక్షలాది మందికి న్యాయం.. కేంద్ర మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏతో లక్షలాది మందికి న్యాయం జరుగుతుందని తెలిపారు. సీఏఏపై కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆదివారం ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీఏఏ కింద పలువురికి పౌరసత్వ ధ్రువీకరణ పత్రం అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. 1947 నుంచి 2014 వరకు దేశంలో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. గత ప్రభుత్వాలు చొరబాటుదారులను దేశంలోకి అనుమతించాయని, అక్రమంగా వారికి పౌరసత్వం ఇచ్చాయని ఫైర్ అయ్యారు.

బౌద్ధులు, సిక్కులు లేదా జైనుల కారణంగా పొరుగు దేశాల్లో హిందువులు హింసకు గురయ్యారు. కానీ వారి సొంత దేశంలోనూ హింసకు గురవడం దారుణమని చెప్పారు. ఇండియా కూటమి వారికి న్యాయం చేయలేదని, ప్రధాని మోడీ చేసి చూపించారని చెప్పారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. విభజన సమయంలో బంగ్లాదేశ్‌లో 27 శాతం మంది హిందువులు ఉండేవారని, అయితే బలవంతపు మత మార్పిడికి గురై ప్రస్తుతం కేవలం 9 శాతం మాత్రమే ఉన్నారన్నారు. అహ్మదాబాద్‌లో 188 మంది హిందూ శరణార్థులకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అమిత్ షా అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed