డిసెంబర్‌‌లోనే లోక్‌సభ పోల్స్ : Mamata Banerjee

by Vinod kumar |   ( Updated:2023-08-28 11:02:58.0  )
డిసెంబర్‌‌లోనే లోక్‌సభ పోల్స్ : Mamata Banerjee
X

కోల్‌కతా: లోక్ సభకు ముందస్తు ఎన్నికలు రావొచ్చని, డిసెంబర్‌లోనే పోల్స్ వచ్చినా ఆశ్చర్యం లేదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి అన్నారు. దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు చాలావరకు హెలికాప్టర్లను బీజేపీ బుక్ చేసేయడమే దీనికి సంకేతమని ఆమె పేర్కొన్నారు. మరో పార్టీ కానీ, కూటమి కానీ జనంలోకి వెళ్లొద్దనే కుట్రతోనే బీజేపీ ముందస్తు ఎన్నికలకు వస్తోందని ఆరోపించారు. కోల్ కతాలో టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడోసారి బీజేపీ గెలిస్తే దేశంలో నిరంకుశ పాలనను చూడాల్సి వస్తుందన్నారు. ‘బెంగాల్‌లో మేం సీపీఎం పాలనకు ముగింపు పలికాం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కూడా తప్పకుండా ఓడిస్తాం’ అని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగొద్దని బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌కు ఆమె సూచించారు. కాగా, ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబైలో జరిగే ఇండియా కూటమి మీటింగ్‌లో పాల్గొనేందుకు దీదీ ముంబైకి వస్తున్నారు. అయితే ఆమె టీ పార్టీ తన ఇంటికి రావాలని బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఆహ్వానించారు.

Advertisement

Next Story