ఆర్టికల్ 370 పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
ఆర్టికల్ 370 పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకాశ్మీర్(JammuKashmir) కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370(Article 370) మీద కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 అనేది ఒక ముగిసిన చరిత్ర అని, దానిని తిరిగి పునరుద్ధరించడం ఎన్నటికీ జరగదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో అమిత షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 2014లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కు గోల్డెన్ పీరియడ్ మొదలైందన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దయ్యాక ఇక్కడ శాంతి స్థాపనకు మార్గం సుగమం అయిందన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదానికి, వెనుకబాటుకు కారణమే 370 ఆర్టికల్ అని, దానిని ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించేది లేదని అమిత్ షా తేల్చి చెప్పారు.

కాగా 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తికి సంబంధించిన 370 ఆర్టికల్ రద్దు చేసి, ఆ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దయ్యాక అక్కడ జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. మూడు విడతలుగా.. సెప్టెంబరు 18న, సెప్టెంబర్ 25న, అక్టోబర్ 1న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు ప్రకటించనున్నారు.




Next Story