త్వరలోనే అమేథీ, రాయ్ బరేలీ అభ్యర్థుల ప్రకటన: కాంగ్రెస్

by Dishanational2 |
త్వరలోనే అమేథీ, రాయ్ బరేలీ అభ్యర్థుల ప్రకటన: కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్ బరేలీ లోక్ నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే 24 నుంచి 30 గంటల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సరైన టైంలో అభ్యర్థిని ప్రకటిస్తామని, అందులో ఎలాంటి జాప్యం లేదని తెలిపారు. ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. బీజేపీ రాయ్ బరేలీని అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈ రెండు స్థానాలకు నెహ్రు, గాంధీ కుటుంబాలతో సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తు చేశారు. అయితే రాహుల్ గాంధీని అమేథీ నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపిందని ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాతో చక్కెర్లు కొట్టడంతో దీనిపై జైరాం రమేశ్ క్లారిటీ ఇచ్చారు. కాగా, సార్వత్రిక ఎన్నికల ఐదో దశలో భాగంగా మే 20న అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

పోటీకి ఆసక్తి చూపని రాహుల్!

అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ అసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అంతేగాక ఈ స్థానాల్లో తమ కుటుంబ సభ్యులను కూడా బరిలో నిలపడం రాహుల్‌కు ఇష్టం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం రాహుల్ బరిలో నిలవాలని ఇప్పటికే అధిష్టానానికి విన్నవించుకున్నాయి. దీంతో ఆయనను పోటీకి ఒప్పించేందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు రాహుల్ గత రాత్రి అంగీకరించి మళ్లి తన నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే అభ్యర్థి ఎంపిక ఆలస్యం అవుతున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed