America: అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం.. స్వదేశానికి చేరిన 205 మంది భారతీయులు

by Shiva |   ( Updated:2025-02-05 08:44:35.0  )
America: అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం.. స్వదేశానికి చేరిన 205 మంది భారతీయులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇచ్చిన మాట మేరకు దేశంలో చొరబడిన అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపాడు. ఈ క్రమంలోనే దేశం వ్యాప్తంగా అక్రమంగా వలస వచ్చిన వారి ఏరివేతకు సెక్యూరిటీ ఫోర్సెస్ (Security Forces) స్పెషల్ ఆపరేషన్‌ (Special Operation) చేపట్టాయి. ఇప్పటికే 18 వేల మంది భారతీయులు అమెరికా (America)లోఅక్రమంగా నివసిస్తున్నట్లుగా నిర్ధారించాయి. ఈ పరిణామంతో దొరికిన వారిని దొరికినట్లుగా అగ్రదేశానికి అక్రమంగా వలస వెళ్లిన భారతీయులను విమానంలో స్వదేశానికి తరలిస్తున్నారు. తాజాగా, టెక్సాస్ (Texas) నగరం నుంచి 205 మంది అక్రమ వలసదారులతో సీ-17 యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ (C-17 US military aircraft) బుధవారం భారత్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.

కాగా, అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే భారత్‌ కూడా రియాక్ట్ అయింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఆ విషయంతో పెద్ద నేరంతో ముడిపడి ఉందని తెలిపింది. వీసా గడువు ముగిసినా లేదా సరైన ధృవీకరణ పత్రాలు చూపకపోయినా.. భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ కూడా ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story