Amaran movie : అమరన్‌ సినిమా వివాదం..తమిళనాడులో ఓ థియేటర్‌పై పెట్రోల్‌ బాంబు దాడి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-16 06:51:19.0  )
Amaran movie : అమరన్‌ సినిమా వివాదం..తమిళనాడులో ఓ థియేటర్‌పై పెట్రోల్‌ బాంబు దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : అమరన్ సినిమా(Amaran movie)పై తమిళనాడు (Tamil Nadu)లో ఆందోళనలు అదుపు తప్పుతున్నాయి. అమరన్‌ సినిమాలో ఓ వర్గానికి వ్యతిరేకంగా సన్నివేశాలున్నాయని ఆగ్రహంతో ఆందోళన కారులు రెచ్చిపోతున్నారు. తాజాగా అమరన్ మూవీ ప్రదర్శించబడుతున్న థియేటర్(theater) పై తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు దాడి(Petrol bomb attack)కి పాల్పడ్డాడు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేళప్పళయం ప్రాంతంలోని అలంకార్‌ థియేటర్ ప్రాంగణం ముందు దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. అదృష్టవశాత్తూ అక్కడెవ్వరు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనపై ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని.. విచారణ కొనసాగుతోందని తిరునల్వేలి జిల్లా పోలీసులు తెలిపారు. ప్రస్తుతంఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీసీ టీవీల ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన అమరన్ సినిమాను దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కించారు. అమరన్ సినిమాపై కొన్ని రోజులుగా వివాదాలు నెలకొన్నాయి. ఈ మూవీలో కాశ్మీరీలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ.. వివిధ సంస్థల నుండి వ్యతిరేకత వస్తోంది. అక్టోబర్ 31 దీపావళి కానుకగా విడుదలైన అమరన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 172 కోట్లు వెట్, అలాగే రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కంగువా సినిమా విడుదల తర్వాత కూడా ప్రస్తుతం మూడో వారం సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో అమరన్ మూవీ వసూళ్లను రాబడుతోంది.

Advertisement

Next Story

Most Viewed