- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మణిపూర్ వరదలపై హేట్ స్పీచ్.. చిక్కుల్లో తెలంగాణ ఇన్ ఫ్లూయెన్సర్
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ హింసపై చేసిన ప్రసంగంతో తెలంగాణకు చెందిన ఇన్ ఫ్లూయెన్సర్ మనోజ్ డేవిడ్ చిక్కుల్లో పడ్డారు. జాతిహింసకు గురైన మణిపూర్ లో ప్రకృతి వైపరీత్యాలు జరిగాలని కోరుతూ ప్రసంగం చేశారు. జులై 29, 2023లో మతబోధకుడైన మనోజ్ డేవిడ్ ఈ వీడియోని యూట్యూబ్ లో పోస్టు చేశారు. రెమాల్ తుఫాన్ వల్ల మణిపూర్ వరదలకు సంబంధించిన ఈ పాత వీడియో వైరల్ గా మారింది. మణిపూర్ లో దైవచింతన కలిగిన ప్రజలపై దాడులు జరుగుతున్నాయని మనోజ్ తన స్పీచ్ లో తెలిపారు. ఈ హింసపై దేవుడు తన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడని.. ఆయన మౌనంగా లేడని అన్నారు. అమాయక ప్రజలను చంపినందుకు రెండు రూపాల్లో దేవుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నారని ప్రసంగించారు. అందుకోసం తన ఇద్దరు దేవదూతలను పంపబోతున్నారని అన్నారు. ఆ ఇద్దరూ భూకంపాలు, వరదలను తెస్తున్నారని పేర్కొన్నారు. కాగా.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మణిపూర్ పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ద్వేషపూరిత ప్రసంగంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో వల్ల రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెరుగుతుందని పేర్కొన్నారు.