- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Allahabad HC: లైంగిక వేధింపుల బాధితురాలికి గర్భాన్ని తొలగించుకునే హక్కు ఉంది.. అలహాబాద్ హైకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక దాడికి గురైన బాధితురాలు తన గర్భాన్ని వైద్య పరంగా తొలగించుకునే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు (Allahabad high court) స్పష్టం చేసింది. బాధితురాలిని బలవంతంగా తల్లిని చేయడం ఆమె గౌరవం, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని నొక్కి చెప్పింది. లైంగిక వేధింపులకు గురైన 17 ఏళ్ల బాలిక తన గర్భాన్ని తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు మహేష్ చంద్ర త్రిపాఠి, ప్రశాంత్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టంలోని సెక్షన్ 3(2)ని గుర్తు చేస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలికి బలవంతంగా మాతృత్వం అనే బాధ్యతను అప్పగించడం ఆమె గౌరవంగా జీవించే మానవ హక్కును తిరస్కరించడమే అవుతుందని తెలిపింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రూల్స్‌లోని రూల్ 3బీ ప్రకారం లైంగిక వేధింపుల బాధితులు, మైనర్లకు 24 వారాల వరకు గర్భధారణను రద్దు చేయడానికి చట్టం అనుమతిస్తుందని కోర్టు పేర్కొంది. పిటిషనర్ 19 వారాల గర్భవతి కాబట్టి అబార్షన్ చేసుకునేందుకు అనుమతించింది.