- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎస్సీ, ఎస్టీ ‘ఉప వర్గీకరణ’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : ఎస్సీ, ఎస్టీలలో ఉప వర్గీకరణ చేసి.. ఆయా వర్గాల రిజర్వేషన్ కోటా నుంచి సబ్ కోటాను కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలా ? వద్దా ? అనే దానిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలలోని అందరూ సామాజిక, ఆర్థిక, విద్య, సామాజిక స్థితిగతుల పరంగా ఒకే విధమైన స్థితిగతుల్లో ఉండకపోవచ్చని పేర్కొంది. ఈ వర్గాలలోని వారంతా అన్ని అంశాలలో ఒకే విధమైన స్టేటస్‌ను అనుభవిస్తున్నారని భావించడం అపోహే అవుతుందని తెలిపింది. ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం’ కేసులో 2004లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రస్తావనకు వచ్చిన సందర్భంగా ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీలంతా ఒకేవిధమైన స్థితిగతులను కలిగి ఉంటారు. అందుకే వారిలో ఉప వర్గీకరణ చేసే హక్కు కానీ.. రిజర్వేషన్ కోటాలో ఉప కోటాను క్రియేట్ చేసే అధికారం కానీ రాష్ట్రాలకు ఉండదు’’ అని ఆ కేసులో 2004లో వచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు ప్రస్తుత ధర్మాసనం విభేదించింది. కేంద్ర సర్కారు తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం’ కేసు తీర్పుతో విభేదించారు. ప్రజలకు సమానమైన అవకాశాలను కల్పించాలన్న రాజ్యాంగపరమైన రక్షణను తిలోదకాలు ఇచ్చేలా ఆ తీర్పు ఉందన్నారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీలలో ఉప వర్గీకరణ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.