All Party Meeting : పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ

by Sathputhe Rajesh |
All Party Meeting : పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ ప్రారంభం అయింది. పార్లమెంటరీ ఎఫైర్స్ మంత్రి కిరణ్ రిజిజు సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ భేటీలో మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై చర్చించనున్నారు. కాగా, సోమవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సోమవారం పార్లమెంట్‌లో టేబుల్ మీదికి తేనున్నారు. ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిరణ్ రిజిజు హాజరయ్యారు. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, లోక్ జనశక్తి నుంచి చిరాగా పాశ్వాన్, జనసేన నుంచి బాలశౌరి, బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి హాజరయ్యారు. నీట్ వివాదం, మణిపూర్ హింస, ధరల పెరుగుదల సహా.. పలు అంశాలపై చర్చకు ప్రతిపక్ష నేతలు పట్టు పట్టారు.

Advertisement

Next Story

Most Viewed