- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
న్యాయవాదులందరూ తప్పనిసరిగా శిక్షణ పొందాలి: సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: న్యాయమూర్తులకు శిక్షణ కోసం నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ఉన్నప్పుడు, న్యాయవాదులకు ఎందుకు ఉండదు. న్యాయవాదులందరూ తప్పనిసరిగా శిక్షణ పొందాలని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. గుర్తింపు పొందిన న్యాయ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉంటే తప్ప వారిని ప్రాక్టీస్ చేసేందుకు అనుమతించకూడదని శుక్రవారం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి అరెస్ట్ అయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య కుమారుడు సౌవిక్ భట్టాచార్య బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. భట్టాచార్య తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సమన్లు జారీ చేయనప్పటికీ ట్రయల్ కోర్టులో ఒక న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తు చేశారని సమర్పించారు. ఈ క్రమంలో 'లాయర్‌ల కోసం లా అకాడమీ ఎందుకు లేదు? జడ్జీలకు ఉంది. బార్ కౌన్సిల్ తప్పు చేసిన న్యాయవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. వారికి సరైన అవగాహన కల్పించాలి. అందుకోసం ఏదైనా చేయండి. ప్రతి లాయర్‌కు, సీనియర్ న్యాయవాదులకు కూడా తప్పనిసరిగా శిక్షణ ఉండాలని' ధర్మాసనం పేర్కొంది. సర్టిఫికేట్ ఉంటే తప్ప వారిని ప్రాక్టీస్ చేసేందుకు అనుమతించకూడదు. ఇలాంటి పద్దతి విదేశాల్లో ఉంది. ఇది ఎవరికీ తెలియదని కాదు, సమస్య ఏమిటంటే ఎవరూ దానిని అమలు చేయాలనుకోరని అభిప్రాయపడింది.