- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘టైమ్స్ ప్రభావవంతులైన 100 మంది’లో భారతీయులు వీరే
దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులకు చోటుదక్కింది. ఈ లిస్టులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియా భట్, ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, ప్రముఖ నటుడు, దర్శకుడు దేవ్ పటేల్ ఉన్నారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన లోన్ ప్రోగ్రామ్స్ ఆఫీస్ డైరెక్టర్ జిగర్ షా, ఖగోళ శాస్త్ర నిపుణులు, యేల్ యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ ప్రియంవదా నటరాజన్, బ్రిటన్‌లో రెస్టారెంట్లు నిర్వహించే భారత సంతతి వనిత అస్మా ఖాన్‌లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. అనుమానాస్పద స్థితిలో జైలులో చనిపోయిన రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ భార్య యులియా నవల్నాయ పేరును సైతం ఇందులో చేర్చడం గమనార్హం. భారత్‌కు చెందిన పలువురు మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోాగాలను బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ఎదుర్కొన్నారు. ఆయన రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ పదవిలో ఉన్నప్పుడు ఆ పదవి నుంచి తప్పించాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగిన స్టార్ రెజర్లలో సాక్షి మాలిక్ ఒకరు.