- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రిలో మంత్రి అతిషిని పరామర్శించిన అఖిలేష్ యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానికి హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని కోరుతూ నిరాహరదీక్ష చేస్తూ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఢిల్లీ ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నీటి మంత్రి అతిషిని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం పరామర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ముఖ్యమంత్రుల సమస్యలు పెరిగాయని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం చాలా వివక్ష చూపింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరోగ్యం, విద్య, ఇతర సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారని, అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అడ్డంకులు సృష్టించారని ఆయన అన్నారు.
బీజేపీకి ముప్పు కలిగించే వారిని సీబీఐ కేసులో ఇరికిస్తారు. కేజ్రీవాల్‌ను బయటకు రాకుండా చూడటానికి సీబీఐని ఉపయోగించుకుంటుంది. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుంది. అతిషి ధైర్యవంతురాలు, ప్రజల కోసం ఎలా పోరాడాలో ఆమెకు తెలుసు. ఢిల్లీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అతిషి పోరాడుతున్నారని అఖిలేష్ మీడియా సమావేశంలో అన్నారు. ఆప్ మంత్రి అతిషి ఢిల్లీలో నీటి సమస్యకు పరిష్కారం కోరుతూ, జూన్ 21న నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం లోక్ నాయక్ ఆసుపత్రిలో అత్యవసరంగా ఐసీయూలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.