అజిత్ పవార్ బహిరంగ క్షమాపణలు

by M.Rajitha |
అజిత్ పవార్ బహిరంగ క్షమాపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇటీవల మహారాష్ట్రలో 35 అడుగుల శివాజీ భారీ విగ్రహం కూలిపోవడం పట్ల అజిత్ పవార్ స్పందిస్తూ.. ఈ ఘటన బాధకరమన్నారు. ఛత్రపతి శివాజీ మాకు ఆరాధ్య దైవమని, ఆయన విగ్రహం కూలిపోవడం పట్ల 13 కోట్ల మహారాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణలు తెలుపుతున్నామని అన్నారు. ఈ ఘటనలో అధికారులు, కాంట్రాక్టర్లు, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విగ్రహం ఆవిష్కరించి ఏడాది గడవక ముందే కూలిపోవడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. కాగా గత డిసెంబర్ 4న నేవీ డేను పురస్కరించుకొని రాజ్ కోట్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించారు. ఏడాది గడవక ముందే భారీ వర్షాల కారణంగా అది కూలిపోవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు, ఆందోళనలకు దారి తీసింది. ఈ క్రమంలోనే అజిత్ ప్రజలను క్షమాపణలు కోరారు.

Next Story

Most Viewed