NCP చిహ్నం, పార్టీ కోసం ఎన్నికల కమిషన్‌ ఆశ్రయించనున్న అజిత్ పవార్

by Mahesh |   ( Updated:2023-07-05 07:04:13.0  )
NCP చిహ్నం, పార్టీ కోసం ఎన్నికల కమిషన్‌ ఆశ్రయించనున్న అజిత్ పవార్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్సీపీ గుర్తు, పేరు తమకే ఇవ్వాలని క్లెయిమ్ చేయడంకోసం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఆయన మామ, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ పార్టీ గుర్తు, పేరుపై ఈసీలో కేవియట్ దాఖలు చేశారు. అలాగే ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు వినాలని శరద్ పవార్ శిబిరం కోరినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ వర్గం మాత్రం తమ వెంట 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకొస్తున్నారు. మహారాష్ట్ర లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల మధ్య ఈసీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed