NDA సర్కార్ మరో కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్‌కు మరోసారి చాన్స్

by Satheesh |   ( Updated:2024-06-13 12:49:27.0  )
NDA సర్కార్ మరో కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్‌కు మరోసారి చాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో ఇటీవల కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్‌ను నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జాతీయ భద్రతా సలహాదారు పదవిలో ప్రస్తుతం కొనసాగుతోన్న దోవల్.. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ పదవిని చేపట్టారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ మూడోసారి కూడా అజిత్ దోవల్‌కు అవకాశం కల్పించింది. దీంతో వరుసగా మూడుసార్లు ఈ పదవిని చేపట్టిన వ్యక్తిగా అజిత్ దోవల్ రికార్డ్ సృష్టించారు. యూరి సర్జికల్ స్ట్రైక్స్‌తో పాటు భారత్ చేపట్టిన ఇతర ప్రతిష్టాత్మక అపరేషన్లలో అజిత్ దోవల్‌ది మాస్టర్ మైండ్. దీంతోనే మరోసారి కేంద్రం ఈ పదవిని ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story