- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
250 విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా రెడీ
దిశ, డైనమిక్ బ్యూరో: చరిత్రలో అతిపెద్ద డీల్‌కు ఎయిర్ ఇండియా సిద్ధమైంది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఎయిర్ ఇండియాను గతేడాది కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తన సేవలను విస్తరించే ప్రణాళికలో భాగంగా మంగళవారం కీలక డీల్ కుదుర్చుకుంది. ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ సంస్థ నుంచి 250 విమానాలను కొనుగోలు చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఎయిర్ బస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు.
ఈ డీల్ ఒప్పందం కోసం వర్చువల్ గా జరిగిన ఎయిర్ ఇండియా- ఎయిర్ బస్ ఒప్పంద కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, రతన్ టాటా తదితరులు పాల్గొన్నారు. ఈడీల్ లో భాగంగా 40 ఏ-350 వైడ్-బాడీ లాంగ్-రేంజ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 210 నారో బాడీ విమానాలు కొనుగోలు చేయబోతున్నారు. ఇవి టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా కోసం ఏ320 నియో ఫ్యామిలీ జెట్‌లైనర్‌లకు చెందినవిగా భావిస్తున్నారు.