- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
థాక్రే.. శరద్ పవార్‌కు లొంగిపోయారు : అమిత్ షా
ముంబై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం కోల్హపూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లోనూ షిండే వర్గంతో కొనసాగుతామని చెప్పారు. బీజేపీ తన మిత్రపక్షాలు గత ఎన్నికల్లో 42 స్థానాలు గెలుచుకోగా, థాక్రే చర్యలతో పొత్తు విడిపోయినట్లు చెప్పారు. థాక్రే శివసేన శరద్ పవార్‌కు లొంగిపోయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోడీ ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. అధికారం కోసం తాము నమ్మిన సిద్ధాంతాలను వదులుకోమని చెప్పారు.
మోడీ, షాలపై షిండే ప్రశంసలు..
మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వ ఏర్పాటులో తనకు మద్దతుగా నిలిచారని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరి అభివృద్ధికి ప్రధాని సహకరించారని పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో తనను ముందుకు వెళ్లమని మోడీ, షా లు సూచించారని అన్నారు.
అంతకుముందు పేదవారు, పేదవారిగా ఉండేవారని ప్రస్తుతం ఆ పరిస్థితులు మారాయని చెప్పారు. మోడీ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నెం.1 నేత అని పొగడ్తల వర్షం కురిపించారు. బీజేపీతో పొత్తు కూడటం సరైనదని అని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. గత ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసి గెలిచినప్పటికీ పొరపాటుగా వేరే వాళ్లతో ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. అయితే తాము తిరిగి బీజేపీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.