‘ఇండియా’ అధికారంలోకి రాగానే అగ్నివీర్ స్కీమ్ రద్దు: రాహుల్ గాంధీ హామీ

by samatah |
‘ఇండియా’ అధికారంలోకి రాగానే అగ్నివీర్ స్కీమ్ రద్దు: రాహుల్ గాంధీ  హామీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ జైన్‌కు మద్దతుగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అఖిలేష్ యాదవ్, రాహుల్ సంయుక్తంగా పాల్గొన్నారు. అనంతరం రాహుల్ ప్రసంగిస్తూ..బీజేపీ నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దేశ ప్రజలకు ఎంతో కీలకమన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే భూమి మీద హక్కులు, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగాలన్నీ కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు.

బీజేపీ వాళ్లు 22 మందిని బిలియనీర్లను తయారు చేస్తున్నారన్నారు. కానీ కాంగ్రెస్ కోట్లాది మంది మిలియనీర్లను సృష్టిస్తుంది. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పేరును ఎంపిక చేసి కోట్లాది మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి లక్ష రూపాయలు బదిలీ చేస్తామన్నారు. దేశానికి రెండు రకాల అమరవీరులు అవసరం లేదని, అగ్ని వీర్ స్కీమ్‌ను రద్దు చేస్తామని చెప్పారు. అదానీకి ప్రయోజనం చేకూర్చడానికే ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గిందని వెల్లడించారు. అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ దేశం నుంచి అధికార పార్టీకి వీడ్కోలు పలికేందుకు ప్రజలు సిద్దమవుతున్నారన్నారు.

Advertisement

Next Story

Most Viewed