26 సంవత్సరాల తర్వాత బడిగంటలు మోగాయి

by Sridhar Babu |
26 సంవత్సరాల తర్వాత బడిగంటలు మోగాయి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో 20 సంవత్సరాల క్రితం మూతపడ్డ ప్రభుత్వ పాఠశాల అధికారుల కృషితో తిరిగి ప్రారంభమైంది. మూగబోయిన బడి గంట కలెక్టర్ చొరవతో మోగింది. దాంతో గ్రామస్తులు పండుగ చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కావడ్ గావ్ అనే గ్రామం ఉంది. ఇది పూర్తి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడ 2005 వరకు స్కూల్ ఉండేది. కానీ 2005 లో సల్వా జుడుం ఏర్పడ్డ నాటి నుండి మావోయిస్ట్ లకు,సల్వా జుడుంకు భీకర యుద్ధం జరిగేది. కావడ్ గావ్ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన ప్రజలు సల్వా జుడుంలో ఉండే వారు భద్రతా దృష్ట్యా వారు స్కూల్ ని తీసివేశారు. అప్పటి నుండి ఆ గ్రామ లో ఉండే పిల్లలు ఎవరూ కూడా బడికి పోయిన సందర్భం లేదు.

గత ఆరు నెలల కిందట పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరు నెలల పాపకు బుల్లెట్ తగిలి చని పోయింది. ఆ రోజు నుండి ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. కానీ ఈ గ్రామంలో 2005 లో ప్రారంభమైన సల్వా జుడుం 2011 లో సుప్రీం కోర్టు నిలిపివేసింది. దీంతో ఆ ప్రాంతం మావోయిస్ట్ ల ఆధీనం లోకి వచ్చింది. ఆ గ్రామస్తులు పలు మార్లు మావోయిస్టులకు స్కూల్ కావాలని చెప్పినా పట్టించుకోలేదు. స్కూల్ భవనాలను పేల్చి వేశారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. అటవీ ప్రాంతంలో పోలీస్ క్యాంప్ లు వెలిశాయి. దీంతో మావోయిస్టు ప్రాంతాలు పోలీసుల ఆధీనం లోకి వచ్చాయి. దీంతో ఈ ఏడాది జిల్లా కలెక్టర్ అనురాగ్ పాండే పోలీస్ అధికారుల సమక్షంలో జూన్ 26 వ తేదీన

ఇరవై ఆరు సంవత్సరాల అనంతరం బడి గంటలు మోగాయి. జిల్లా కలెక్టర్​ స్వయంగా వెళ్లి ప్రారంభోత్సవం చేసి ఆ ఊరి గ్రామస్తులతో, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి , పూజ చేసి స్కూల్ ప్రారంభోత్సవం చేశారు. పిల్లలకు బట్టలు, బుక్స్, స్కూల్ కి చెందిన అన్ని రకాల వస్తువులు పంచి స్కూల్ ప్రారంభించారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో ఇన్ని రోజులకు బడి గంటలు మొగడంతో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story