గొర్రెల కాపరుల సాహసం: లడఖ్‌లో చైనా జవాన్లపై తిరుగుబాటు!

by samatah |
గొర్రెల కాపరుల సాహసం: లడఖ్‌లో చైనా జవాన్లపై తిరుగుబాటు!
X

దిశ, నేషనల్ బ్యూరో: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) దగ్గర తమ గొర్రెలను మేపకుండా అడ్డుకున్న చైనా సైనికులతో లడఖ్‌కు చెందిన గొర్రెల కాపరుల బృందం తిరుగుబాటు చేసింది. వివరాల్లోకి వెళ్తే..ఇండియా-చైనా సరిహద్దు లడఖ్‌లో భారత్‌కు చెందిన గొర్రెల కాపర్లు గొర్రెలు మేపుతున్నారు. ఈ క్రమంలో అక్కడికి చైనాకు చెందిన మూడు సాయుధ వాహనాలు, అనేక మంది డ్రాగన్ జవాన్లు వచ్చారు. వాహనాల శబ్దం చేస్తూ.. గొర్రెల కాపరులను అక్కడి నుంచి వెళ్లి పొమ్మని చెప్పారు. కానీ ఏ మాత్రం బెదరకుండా గొర్రెల కాపర్లు చైనా సైనికులకు ఎదురు తిరిగారు. ఇది భారత భూభాగమని, పశువుల్ని మేపుకోవడం మా హక్కు అని వాదించారు. ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే గొర్రెల కాపర్లు కేవలం చైనా సైనికులతో వాదనకు దిగారే దాడులకు పాల్పడిన పరిస్థితులు అక్కడ కనపించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు గొర్రెల కాపరుల ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. కాగా, ఎల్ఏసీ అనేది భారత్, చైనా భూభాగాలను వేరుచేసే ఒక సరిహద్దు రేఖ. 2020 గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత స్థానిక గొర్రెల కాపరులు ఈ ప్రాంతంలో జంతువులను మేపడం మానేశారు. ఈ క్రమంలో మళ్లీ మేపడం ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ స్పందించారు. గొర్రెల కాపర్లు చూపిన ధైర్య సాహసాలు ఎనలేనివని కొనియాడారు. వారికి మద్దతు ఇస్తున్న భారత సైన్యానికి అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story