అదానీ ఇష్యూ: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

by GSrikanth |
అదానీ ఇష్యూ: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ వ్యవహరంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల భద్రతను నిర్ధారించేందుకు నిపుణుల కమిటీ పేర్లు సీల్డ్ కవర్‌లో తీసుకోవడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అదానీ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఇవాళ సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించడానికి ఏర్పాటు చేయబోయే కమిటీ వివరాల ప్రతిపాదనలు సీల్డ్ కవర్‌లో ఇవ్వడం సరికాదని ధర్మాసనం పేర్కొంది.

మాకు సీల్డ్ కవర్ అక్కర్లేదని తామూ పూర్తిగా పారదర్శకతను కోరుకుంటున్నామని తెలిపింది. మేము సీల్డ్ కవర్‌లో సూచనలను అంగీకరిస్తే అది ప్రభుత్వం నియమించిన కమిటీ అని ప్రజలు భావిస్తారని పేర్కొంది. నిపుణుల కమిటీ సభ్యులపై న్యాయమూర్తులే నిర్ణయం తీసుకుంటాని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహాతాకు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తామే ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొంటూ అదానీ అంశంపై దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషన్లపై తీర్పును వాయిదా వేసింది.

Advertisement

Next Story