- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమను నిరాకరించిందని మైనర్‌పై యాసిడ్ దాడి..
దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కొంత మంది ప్రేమించలేదని అమ్మాయిలపై దాడి చేస్తే. మరికొంత మంది లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా, కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది ప్రేమను నిరాకరించిందని ఓ మైనర్‌పై యాసిడ్ దాడి చేశాడు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కనకపురలో 22 ఏళ్ల యువకుడు మైనర్ బాలికను కనకపురలోని బైపాస్ రోడ్డు దగ్గర కలవాలని పిలిచాడు. అక్కడకు వచ్చాక నిన్ను ప్రేమిస్తున్నానని బాలికకు చెప్పారు. దానికి ఆ బాలిక అంగీకరించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు బాలికపై యాసిడ్ దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది.
ఈ విషయం బాలిక సోదరుడి స్నేహితులకు తెలియడంతో బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె కన్ను దెబ్బతినింది. ఆమె కంటిలోని మూడు పొరల్లోకి యాసిడ్ పోయిందని డాక్టర్ తెలిపారు. బాలిక సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని వెతికి పట్టుకున్నారు. దాడి చేసిన వ్యక్తి మెకానిక్‌గా పనిచేస్తున్న కురుపేటకు చెందిన సుమంత్‌గా గుర్తించారు.