- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. సీ-వోటర్ సర్వే అంచనా
బెంగళూరు: రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్ శ్రేణుల్లో సీ-వోటర్ సర్వే ఫుల్ జోష్ నింపుతోంది. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించనుందని ఈ సర్వే అంచనా వేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొద్దిసేపటికే ఏబీపీ సీ-వోటర్ తన సర్వేను బుధవారం విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రానుంది.
ఈ రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా, అధికారంలోకి రావాలంటే, కనీసం 113 సీట్లలో విజయం సాధించాలి. అయితే, కాంగ్రెస్ ఈ మ్యాజిక్ ఫిగర్ దాటి కనీసం 115 నుంచి 127 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించనుందని సర్వే తేల్చింది. ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలతో ఉన్న బీజేపీ.. రానున్న ఎన్నికల్లో కేవలం 68 నుంచి 80 స్థానాలకే పరిమితం కానున్నట్టు వెల్లడించింది. ఇక, జేడీఎస్ గత ఎన్నికల్లో(28) మాదిరిగానే ఈసారి కూడా 23 నుంచి 35 సీట్లలో గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది.
బీజేపీపై 50శాతానికిపైగా వ్యతిరేకత..
ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 50.5శాతం రాష్ట్రంలో అధికార బీజేపీ పనితీరు దారుణంగా ఉందని చెప్పినట్టు సీ-వోటర్ సర్వే తెలిపింది. 27.7శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాలన బాగుందని చెప్పినట్టు పేర్కొంది. మిగతా 21.8శాతం మంది ఆవరేజ్ రేటింగ్ ఇచ్చినట్టు తెలిపింది. ముఖ్యంగా సీఎం బొమ్మైపై అసంతృప్తితో ఉన్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో ప్రధాని మోడీ పనితీరును మాత్రం మెచ్చుకున్నట్టు పేర్కొంది. బీజేపీపై వ్యతిరేకతకు ప్రధాన కారణాలు నిరుద్యోగం, విద్యుత్, నీరు, రోడ్ల సమస్యలేనని సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించారు.
తర్వాతి సీఎం ఎవరు..?
తర్వాతి సీఎం ఎవరైతే బాగుంటుంది? అని అడిగిన ప్రశ్నకు చాలానే పేర్లు చెప్పినట్టు సర్వే పేర్కొంది. అయితే, అత్యధికంగా 39.1శాతం మంది కాంగ్రెస్ లీడర్ సిద్ధరామయ్యను తమ సీఎంగా ఎన్నుకున్నారు. ఇదే సమయంలో 31.1శాతం మాత్రం ప్రస్తుతం సీఎం బొమ్మైనే తదుపరి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. ఇక, 21.4శాతం మంది జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమార స్వామి పేరు చెప్పగా, 3.2శాతం మంది కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేరు తెలిపినట్టు సర్వే వెల్లడించింది. ముఖ్యంగా అర్బన్ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిపింది. కాగా, ఈ సర్వేను కర్ణాటక వ్యాప్తంగా ఫిబ్రవరి 26 నుంచి ఈ నెల 26వరకు నిర్వహించారు. ఇందులో 24,759 మంది పాల్గొన్నారు.