టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంలో.. అభిషేక్ బెనర్జీ అనుచరుడి అరెస్ట్

by Shiva |
టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంలో.. అభిషేక్ బెనర్జీ అనుచరుడి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అనుచరుడు ఎస్‌.కే బద్రాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కాం కేసుతో అతనికి సంబంధం ఉన్న నేపథ్యంలో బద్రాను అరెస్ట్ చేశారు. దాదాపు అతడిని 12 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత సీబీఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా బద్రా నివాసంలో ఇటీ ఈడీ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు.

Advertisement

Next Story