- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపు కేజ్రీవాల్ అరెస్టు.. మా దగ్గర సమాచారం ఉంది: మంత్రి అతిషీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ పార్టీ కీలక నేత, ఢిల్లీ మంత్రి అతిషీ తెలిపారు. లిక్కర్ పాలసీ కేసులో ఆయన్ను ప్రశ్నించిన అనంతరం ఈడీ అదుపులోకి తీసుకోనుందని, దీనిపై తమకు సమాచారం ఉందని వెల్లడించారు. ‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ కేసులో ఈ నెల 2న విచారణకు రావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ సోమవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అతిషీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని బీజేపీకి తెలుసు కాబట్టి, ఆప్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ తరహా వ్యూహాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ‘ఈ నెల 2న కేజ్రీవాల్ అరెస్టు కాబోతున్నట్లు మాకు రిపోర్టు అందింది. ఆయన అరెస్టు అయితే గనుక, అది అవినీతి అభియోగాల కేసులో కాదు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే అరెస్ట్ అవుతారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లలో బీజేపీని ఆప్ రెండుసార్లు ఓడించింది. దీంతో కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారు. ఆప్‌ను ఎన్నికల్లో ఓడించలేరన్న విషయం వారికి అర్థమైంది. అందుకే, మా పార్టీ ముఖ్య నేతలను తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేస్తున్నారు’ అని అతిషీ వెల్లడించారు.
కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత సీబీఐ, ఈడీలను వాడుకుని ‘ఇండియా’ కూటమి నేతలను, ప్రతిపక్ష పార్టీల సీఎంలను టార్గెట్ చేస్తారని చెప్పారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత బీజేపీ తదుపరి టార్గెట్ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేరళ, తమిళనాడు సీఎంలు పినరయి విజయన్, ఎంకే స్టాలిన్లేనని ఆరోపించారు.