- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మాల్దా జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తాజాగా వెలుగులోకి రావడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఇద్దరు వ్యక్తులు ఒక మహిళను ఆమె పశువులు పోలంలో తిరుగుతున్నాయని చెప్పి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి బలవంతంగా పాడుబడిన షెడ్‌లోకి ఈడ్చుకెళ్లి రెండు గంటల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఘటన అనంతరం ఆ మహిళ తెల్లవారుజామున 2 గంటలకు ఇంటికి తిరిగి చేరుకుని భయంతో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఇరుగుపొరుగు వారితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఆమె తన ఫిర్యాదులో తన గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లను పేర్కొంది, దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. బాధితురాలు కూలి పనులు చేస్తూ తన భర్త, పిల్లలతో కలిసి నివసిస్తుంది. ఆమె భర్త వలస కూలి. సామూహిక అత్యాచారం ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. దీనిపై మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. మరో బెంగాల్ కూతురు మళ్లీ సామూహిక అత్యాచారానికి గురైంది. మాల్దాలో వలస కూలీ భార్యను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా? ఒక మహిళగా మీరు మహిళలపై ఈ పైశాచిక హింసను ఎలా భరిస్తున్నారు? వారు ఎక్స్ పోస్ట్‌లో రాశారు.