షర్ట్‌ పైకెత్తి వక్షోజాలు చూపించిన మహిళా మంత్రి.. నెట్టింట దుమారం రేపుతోన్న వీడియో!

by Anjali |
షర్ట్‌ పైకెత్తి వక్షోజాలు చూపించిన మహిళా మంత్రి.. నెట్టింట దుమారం రేపుతోన్న వీడియో!
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ ఈవెంట్‌లో మహిళా మంత్రి చేసిన పనికి సోషల్ మీడియాలోని నెటిజన్లంతా నోరెళ్లబెట్టుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే.. నార్వే దేశానికి చెందిన 40 ఏళ్ల లుబ్నా జాఫెరీ అనే మహిళ ఆ దేశంలోనే కల్చర్ అండ్ జెండర్ ఈక్వాలిటీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈమె నిన్న నార్వేలో ఏర్పాటు చేసిన ఓ ఫ్రైడ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తను వేదికపైకొచ్చి గే మామ్ 2024 పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం వేదికపైనే అందరిముందు మంత్రి తన టీషర్ట్ పైకెత్తి రొమ్ములను ప్రదర్శించి.. పెద్ద వివాదం సృష్టించింది. ఏ మాత్రం భయపడకుండా టాప్ పైకి లేపి.. అక్కడున్న జనాందరికీ కనిపించేలా తన బాడీని షేక్ చేస్తూ నవ్వుతూ చూపించింది. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా లుబ్నా చేసిన పనికి చప్పట్లతో అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మంత్రి స్టేజ్‌పై ప్రవర్తించిన తీరుపై జనాలు తప్పుపడుతున్నారు. మరికొంతమంది అబ్బాయిలతో అమ్మాయిలు కూడా ఇక్వల్ అని చెప్పడమే మంత్రి లుబ్నా జాఫెరీ ఉద్దేశమని సమర్థిస్తున్నారు. ఇక ఆ దేశ ప్రధాని జొనాస్‌కూడా మహిళా మంత్రిని అభినందించారు. లుబ్నా చేసింది నిజంగా సాహసోపేతమైన పని ఆయన పొగిడారు.

Advertisement

Next Story

Most Viewed