- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళతో జార్ఖండ్ మంత్రి అసభ్య ఫోన్ కాల్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళకు జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా వీడియో కాల్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అక్కడి ప్రతిపక్షాలు ఆరోగ్య శాఖ మంత్రి (కాంగ్రెస్ ఎమ్మెల్యే) బన్నా గుప్తా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా ఫోన్ లో ఓ మహిళతో మాట్లాడారు. వారిద్దరి మధ్య అసభ్య సంభాషణ జరిగినట్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో ద్వారా ఈ విషయం తెలుస్తోంది. కాగా సదరు వీడియోను బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ట్విట్టర్ వేదిక ద్వారా షేర్ చేశారు.
ఈ సందర్భంగా నిషికాంత్ దుబే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ తీరు ఇది అని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఈ విషయంపై సీఎం హేమంత్ సోరెన్ స్పందించి మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాగా ఆ వీడియోపై మంత్రి బన్నా గుప్తా స్పందించారు. అది తన వీడియో కాదని, ఎవరో కావాలనే వీడియో ఎడిట్ చేసి రాజకీయంగా తనను బద్నాం చేయాలని చూస్తున్నారని అన్నారు.