టీచర్ చేసే పనికి స్కూల్‌కు విద్యార్ధులు బంద్!

by Ramesh N |
టీచర్ చేసే పనికి స్కూల్‌కు విద్యార్ధులు బంద్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ తప్ప తాగి ఓ స్కూల్‌కు వచ్చారు. అంతే కాకుండా తాగిన మైకంలో ఆ పాఠశాలకు వచ్చి ఆ స్కూల్ ఆవరణలోని మెట్లపై నిద్రలోకి జారుకున్నారు. దీంతో ఓ విద్యార్థి వీడియో తీశారు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పాఠశాల ఉపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకి వచ్చినందుకు అతన్ని సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయుడిని రాజేంద్ర నేతమ్‌గా గుర్తించారు. గతంలో కూడా పాఠశాలలో ఆయన మద్యం తాగి వచ్చేవాడని విద్యార్థులు చెబుతున్నారు.

ఆ టీచర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు తరచూ పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేసేవారని, అయినా అతని పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు తెలిపారు. టీచర్ ప్రవర్తన కారణంగా కొంతమంది విద్యార్థులు పాఠశాలకు రావడం మానేసినట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా అధికారులు, విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి అతన్ని సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story