- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహీంద్రా కంపెనీ కల్చరల్ ఫెస్ట్ కు చీఫ్ గెస్ట్ గా స్వీట్ కార్న్ వెండర్..!
దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే దిగ్గజ కంపెనీగా పేరుగాంచిన మహీంద్రా టెక్ కంపెనీ కల్చరల్ ఫెస్టివల్ కు చీఫ్ గెస్ట్ గా ఓ స్వీట్ కార్న్ వెండర్ హాజరు కానునున్నాడు. మహీంద్రా కంపెనీ ఓనర్ ఆనంద్ మహీంద్రా ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కాగా అంత పెద్ద కంపెనీ ఫెస్టివల్ కు మొక్కజొన్న కంకులు అమ్ముకునే వ్యక్తిని చీఫ్ గెస్ట్ గా పిలవడమేంటనీ కదా మీ డౌట్. అయితే చదవండి మరి. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంత్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. దేశంలోని యంగ్ టాలెంట్ ను కనిపెట్టి తన ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. అందుకే ఆయన ట్విట్టర్ పోస్టులను 'గోల్డ్ మైన్స్ ఆఫ్ టాలెంట్స్' అని అంటుంటారు.
అయితే తాజాగా ఈ దిగ్గజ పారిశ్రామికవేత్త అలాంటి ఓ టాలెంటెడ్ వ్యక్తిని తన ట్విట్టర్ ద్వారా పరిచయం చేశారు. అతడు ఓ సాధారణ స్వీట్ కార్న్ (మొక్కజొన్న) వెండర్. అయితే అతడికి ఉన్న టాలెంట్ మాత్రం అసాధారణం. తన దగ్గరికి వచ్చే కస్టమర్లకు ఓ చిన్న ప్లాస్టిక్ కప్ లో స్వీట్ కార్న్ ఇస్తుంటాడు. స్వీట్ కార్న్ ను ఆ కప్ లో వేసే ముందు ఓ స్టీల్ గిన్నెలో స్వీట్ కార్న్ కు మసాలా కలుపుతుంటాడు. అలా మిక్సింగ్ చేస్తున్నప్పడు అతడు 'కుతు' అనే తమిళనాడులో బాగా ఫేమస్ డ్యాన్స్ కు బీట్ వాయిస్తుంటాడు. ఇతడి టాలెంట్ కు ఇంప్రెస్ అయిన ఆనంద్ మహీంద్రా.. త్వరలో బెంగళూరులో జరగనున్న తమ కంపెనీ పెర్కషన్ ఫెస్టివల్ కు ఆ యంగ్ టాలెంటెడ్ యువకుడిని చీఫ్ గెస్ట్ గా పిలవనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రిథమ్, పెర్కషన్ అనేవి భారత దేశానికి హృదయ స్పందనలాంటివని ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా అన్నారు.
ఇవి కూడా చదవండి : పిల్లలు టీవీ చూస్తున్నారా.. అయితే వారిపై ఈ ప్రభావాలు పడొచ్చు !