బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశాలు

by S Gopi |
బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరన్‌కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు శుక్రవారం అతనిపై లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియోగాలు మోపాలని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పూత్ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఆరు కేసులు నమోదు చేయగా, ఐదు కేసుల్లో తగిన ఆధారాలు ఉన్నట్టు కోర్టు స్పష్టం చేసింది. మే 21న అతనిపై అభియోగాలు నమోదు చేయాలని పేర్కొంది. మరో కేసును కొట్టివేసింది. దీనిపై బాధితుల్లో ఒకరైన సాక్షి మాలిక్ శుక్రవారం స్పందించారు. కేసు సరైన దిశలో సాగుతోందని, బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగడం సంతోషంగా ఉందని అన్నారు. ఇది ఖచ్చితంగా విజయం వైపునకు ఒక చిన్న అడుగు లాంటిది. అంతిమ న్యాయం లభించే వరకు, బ్రిజ్ భూషణ్‌కు శిక్ష పడే వరకు మా పోరాటం కొనసాగిస్తామని సాక్షి మాలిక్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed