- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అంబులెన్స్ రాకపోవడంతో తోపుడు బండిపైనే తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆరేళ్ల చిన్నోడు (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ఓ ఆరేళ్ల చిన్నోడు అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని తోపుడు బండిపై పడుకోబెట్టి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. హృదయ విదారకమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌళి జిల్లా బలియారి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడి భార్య అంబులెన్స్ కు కాల్ చేసింది. గంటకు పైగా ఎదురు చూసినా అంబులెన్స్ రాకపోవడంతో ఆమె తన ఆరేళ్ల కొడుకు సాయంతో తన భర్తను తోపుడుబండిపై పడుకోబెట్టి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరింది. ఆమె ముందు నుంచి తోపుడు బండిని లాగతుంటే వెనక నుంచి కొడుకు ఆ బండిని నెట్టుకుంటూ ఎంతో శ్రమతో ఆసుపత్రి చేరుకున్నారు.
ఈ క్రమంలోనే తల్లికొడుకులు తోపుడు బండిని లాగుతున్న దృశ్యాన్ని సదాఫ్ ఆఫ్రీన్ అనే ఓ యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియ వైరల్ గా మారింది. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడ్డారు. కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ప్రతి పక్షాలు విమర్శలు చేశాయి. వెంటనే రంగంలోకి దిగిన వైద్యశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సింగ్రౌలి అడిషనల్ కలెక్టర్ డీపీ బుర్మాన్ ఆదేశించారు.