నాలుగేళ్ల బాలికలపై పాఠశాల స్వీపర్ లైంగిక దాడి.. బద్లాపూర్ లో దారుణం

by M.Rajitha |
నాలుగేళ్ల బాలికలపై పాఠశాల స్వీపర్ లైంగిక దాడి.. బద్లాపూర్ లో దారుణం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై లైంగిక దాడి చేశాడు అదే పాఠశాలకు చెందిన స్వీపర్. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని బద్లాపూర్ పట్టణంలో ఓ ప్రముఖ పాఠశాలలో చదివే ఇద్దరు నాలుగేళ్ల బాలికలు టాయ్లెట్ కి వెళ్ళినపుడు, వాటిని శుభ్రం చేసేందుకు అదే సమయంలో అక్కడికి వచ్చిన స్వీపర్ ఆ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికయినా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలికలు మౌనంగా ఉన్నారు. ప్రైవేట్ పార్ట్శ్ దగ్గర విపరీతమైన నొప్పితో బాధపడుతుండగా.. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళగా, ఆ బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారించాడు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళి నిలదీయగా, అలాంటిదేం లేదంటూ కప్పిపుచ్చుకున్నారు పాఠశాల యాజమాన్యం. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఈ విషయం మిగతా విద్యార్థులకు తెలియడంతో పాఠశాల వద్ద ధర్నాకు దిగి, పాఠశాల మీద దాడి చేశారు. స్వీపర్ ను పోలీసులు అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు పాఠశాల నిర్లక్ష్యంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, పట్టణ వ్యాప్తంగా ధర్నాలు చేశారు. ఈ నిరసనలు బద్లాపూర్ రైల్వే స్టేషన్ కు చేరి, నిరసనకారులు పట్టాలపై బైఠాయించడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పాఠశాల యాజమాన్యం తీరిగ్గా క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంది.

Next Story

Most Viewed