నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా

by Satheesh |
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా
X

దిశ, డైనమిక్ బ్యూరో: నమీబియా నుంచి తీసుకొచ్చిన ఓ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. 17 సెప్టెంబర్ 2022న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతపులికి నాలుగు పిల్లలు పుట్టినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సూఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా తల్లితో చిరుత పిల్లలు ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంది.

కాగా, చిరుతల్లో ఒకటైన సాషా.. కిడ్నీ వ్యాధి కారణంగా మరణించిన మూడు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. సాషా, మరో ఏడు పెద్ద చిరుతలతో పాటు ఆఫ్రికన్ దేశం నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్(కేఎన్‌పీ)కి తరలించారు. నాలుగున్నర సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆడ చిరుత చనిపోవడం ప్రాజెక్ట్ చీతాకు ఎదురుదెబ్బ తగిలింది. కాగా, చివరి చిరుత 1947లో భారతదేశంలో మరణించింది. 1952లో దేశంలో చిరుతలు అంతరించిపోయినట్లు కేంద్రం ప్రకటించింది. అవి అంతరించిపోయిన ఏడు దశాబ్దాల తర్వాత, గతేడాది సెప్టెంబరు మధ్యలో నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకొచ్చి షియోపూర్ జిల్లాలోని కేఎన్‌పీలో ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed