ఈ దున్నను అమ్మితే 30 బెంజ్ కార్లు కొనొచ్చు.. ఎందుకు అంత ఖరీదో తెలుసా..?

by Javid Pasha |   ( Updated:2023-04-13 12:12:26.0  )
ఈ దున్నను అమ్మితే 30 బెంజ్ కార్లు కొనొచ్చు.. ఎందుకు అంత ఖరీదో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: పశువుల సంతలో ఆవు, ఎద్దు, దున్నపోతు వంటి పశువులను క్రయవిక్రయాలు చేస్తుంటారు రైతులు. పశువుల ధరలు సీజన్ ను బట్టి, వాటి భౌతిక స్థితిని బట్టి ఉంటాయి. ఎంత పెద్ద ఎద్దుకైనా లక్ష రూపాయల రేటు రావడం కష్టం. ఇక దున్నపోతుకైతే 50 వేలు దాటదు. కానీ హరియాణాలోని ‘షెహన్‌షా’ అనే ఓ ముర్రాజాతి దున్నపోతు వీటన్నింటికీ భిన్నం. దాని ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే ఆ దున్నపోతు ఖరీదు అక్షరాల రూ.25 కోట్లు. ఇంత ఖరీదు పలుకుతున్న ఈ దున్న కథాకమీషు ఏంటో తెలుసుకుందాం.

హరియాణా రాష్ట్రం పానిపట్ జిల్లాకు చెందిన నరేంద్ర సింగ్ అనే రైతు వద్ద ముర్రాజాతికి చెందిన దున్నపోతు ఉంది. దీన్నిఆయన షెహన్‌షా అని పిలుచుకుంటాడు. పదేళ్ల వయసు ఉన్న ఈ దున్న 15 అడుగుల పొడవు ఉంటుంది. ఇక ఈ జాతి దున్నపోతులకు ఇంత ధర ఉండటానికి ప్రధానం కారణం వాటి వీర్యం. ముర్రాజాతి దున్నపోతుల వీర్యానికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే షెహన్‌షా నుంచి వచ్చే వీర్యాన్ని అమ్ముతూ నరేంద్ర సింగ్ లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ దున్న నుంచి తీసే వీర్యం నుంచి నెలకి దాదాపు 800 డోసులు తయారు చేస్తారు. దున్నపోతు వీర్యం అమ్మడం ద్వారా దాదాపు నెలకి 9.6 లక్షల రూపాయలు సంపాదిస్తుంటాడు ఈ రైతు. ఇక ఇటీవల నిర్వహించిన చాంపియన్‌షిప్‌లో ఈ దున్న రూ. 30 లక్షలు గెలుచుకుంది. మరి ఇంత ఆదాయాన్ని ఇస్తోంది కాబట్టే ఈ జాతి దున్నలను నల్లబంగారం అని పిలుస్తుంటారు.


తనకు లక్షల రూపాయల ఆదయాన్ని ఇస్తున్న షెహన్‌షాను నరేంద్ర సింగ్ కంటికిరెప్పలా కాపాడుకుంటున్నాడు. వేసవి కాలంలో ఎండ వేడిమి నుంచి కాపాడటానికి ఈ దున్న కోసం ప్రత్యేకంగా కొలను నిర్మించాడు. ఇక దానికి కావాల్సిన ఆహారం కోసం తనకున్న పొలాల్లో గడ్డితో పాటు ఇతర మొక్కలను పెంచుతున్నాడు. కాగా ఈ దున్నపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. సాఫ్ట్ వేర్ జాబ్.. గవర్నమెంట్ జాబ్ లాంటివి ఎందుకు.. ఇలాంటి ఒక్క దున్నపోతు ఉంటే చాలు లైఫ్ సెటిల్డ్ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. ఈ దున్నను అమ్మితే 30 బెంజ్ కార్లు కొనొచ్చు అంటూ మరికొందరు నెటిజన్లు సరదాగా పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి: భూమి తిరగడం ఆగిపోతే.. మనుషులు చనిపోవడం ఖాయమా..?


Advertisement

Next Story