కుక్కను బైక్‌కు కట్టేసి 2 కి.మీ ఈడ్చుకెళ్లిన వ్యక్తి.. (వీడియో)

by Hamsa |
కుక్కను బైక్‌కు కట్టేసి 2 కి.మీ ఈడ్చుకెళ్లిన వ్యక్తి.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో కొంత మంది కుక్కలను తమ ఇంట్లో వారిగా భావించి వాటిని కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ, మరికొంత మంది మాత్రం వాటిని చూడడానికి ఇష్టం లేక కుక్కలపై తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు. తాజాగా, యూపీలోని ఘజియా‌బాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో ఇస్మాయిల్ అనే వ్యక్తిని ఇటీవల కుక్క కరిచింది. దీంతో అతడు కుక్కపై కోపంతో దారుణానికి పాల్పడ్డాడు. కుక్కను తన బైక్‌కు కట్టి అతి దారుణంగా దాదాపు 2 కిలోమీటర్లు లాకెళ్లాడు. అది గమనించిన వారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. కుక్కను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed