- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు మీద కరెన్సీ నోట్లు విసురుతూ యువకుడి హల్ చల్.. వామ్మో అసలు కారణం అదా..?
దిశ, వెబ్ డెస్క్: మహరాష్ట్రలోని హింగోలి టౌన్లో రోడ్డు మీద కరెన్సీ నోట్లు విసురుతూ ఓ యువకుడు హల్ చల్ చేశాడు. అయితే ఆ యువకుడు దేనికోసం అలా చేస్తున్నాడో తెలియక స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇవ వివరాల్లోకి వెళ్తే.. నాసిరకం పురుగుల మందులు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారని, రైతులను నిండా ముంచుతున్న ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న స్వాభిమాని కిసాన్ సంఘ్ సభ్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. హింగోలి ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆ కార్యాలయం ఎదుట గాల్లో కరెన్సీ నోట్లను చల్లుతూ నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ మంత్రి అబ్దుల్ సత్తార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 8 సంస్థలు నాసిరకం పురుగుల మందులు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా సదరు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక యువకుడు నోట్లను గాల్లోకి విసురుతూ నిరసన వ్యక్తం చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో ‘‘నీది మామూలు ఐడియా కాదు గురూ’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇంతకు అవి ఒరిజినల్ నోట్లేనా అంటూ మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు.
हिंगोली महाराष्ट्र में पेस्टिसाइड कंपनी के विरोध में नोट उड़ाकर विरोध प्रदर्शन, गलत दवा देने का आरोप करते लगाते हुए, हिंगोली में स्वाभिमानी किसान संघ की और से नोटो को उड़ाते हुए कृषि मंत्री अब्दुल सत्तार और कृषि विभाग के खिलाफ अनोखा विरोध प्रदर्शन किया गया । pic.twitter.com/fNhKNLX3yT
— Namrata Dubey (@namrata_INDIATV) May 22, 2023