గర్ల్‌ఫ్రెండ్‌కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్..షాకింగ్ ఏంటంటే?

by Disha Web Desk 18 |
గర్ల్‌ఫ్రెండ్‌కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్..షాకింగ్ ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: చైనాలో ఓ లవర్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి తేరుకోలేని షాక్ ఇచ్చాడు. ఇటీవల సోషల్ మీడియాలో వింతలు, విశేషాలతో పాటు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ ‌గా మాజీ ప్రియుడు పంపిన బాంబు పార్సిల్ వల్ల ఓ వివాహిత భర్తని, కూతురు చనిపోయారనే విషయం తెలిసిందే. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..వివాహానికి ముందుగా యువతికి ఫ్లాట్ కొనివ్వాలని అమ్మాయి తల్లిదండ్రులు షరతు విధించారు. దీంతో ప్రియుడు తన గర్ల్‌ఫ్రెంగ్‌కి భారీ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలో పడ్డాడు. దీంతో ఏం చేయాలో తోచని సదరు బాయ్‌ఫ్రెండ్ ఓ ప్లాన్ వేశాడు. రూ.80 లక్షల నకిలీ నోట్లను సూట్‌ కేసులో పెట్టి యువతికి ఇచ్చాడు. ఆ డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు యువతి వెళ్లగా అసలు బండారం బయటపడింది. పైన కొంతమేర అసలు నోట్లు పెట్టి మిగతా అంతా నకిలీ నోట్లతో నింపేశాడట. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed