కరోనా అలర్ట్.. గడిచిన 24 గంటల్లో 9,111 COVID-19 కేసులు నమోదు

by Mahesh |
కరోనా అలర్ట్.. గడిచిన 24 గంటల్లో 9,111 COVID-19 కేసులు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో 9,111 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల నిన్నటితో పోల్చుకుంటే కాస్త తక్కువే అయినప్పటికీ వరుసగా నాలుగో రోజు 9వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కి చేరుకుంది. కాగా గడిచిన 24 గంటల్లో 27 మరణాలు నమోదవడంతో కరోనా మృతుల సంఖ్య 5,31,141కి పెరిగింది.

Advertisement

Next Story