- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం.. భారత్‌లో ఉచిత రేషన్: సీఎం యోగి ఆదిత్యనాథ్
by Harish |
X
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మోడీ నాయకత్వం పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో అభివృద్ధిలో దేశం అత్యున్నత శిఖరాలు అధిరోహించిందని అన్నారు. శుక్రవారం కౌశంబి లో నిర్వహించిన కార్యక్రమంలో యోగీ మాట్లాడారు. భారత్‌లో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించారని చెప్పారు. దాయాది దేశం పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం కొనసాగుతున్న సమయంలో.. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ ఇచ్చిన స్ఫూర్తితో యువత క్రీడల్లో భాగస్వామ్యం అవుతున్నారని చెప్పారు. కౌశంబి ప్రాంతం చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉందని, రాముడు కూడా ఒక రాత్రి బస చేశారని భావిస్తున్నట్లు అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే 2025 కుంభ మేళాకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని, అందుకు ప్రజలు, అధికారులు సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
Advertisement
Next Story