65శాతం మంది మోడీనే పీఎంగా కోరుకుంటున్నారు: ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్

by samatah |
65శాతం మంది మోడీనే పీఎంగా కోరుకుంటున్నారు: ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని మెజారిటీ ప్రజలు ప్రధాని మోడీనే మరోసారి పీఎం కావాలని కోరుకుంటున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. రాష్ట్రంలోని అధికార కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ లక్ష్యం దిశగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బారామతిలో ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘65 శాతం మందికి పైగా ప్రజలు నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో నేను కూడా కష్టపడి పని చేస్తా. లోక్ సభలో ఎన్డీయే కూటమి 400 సీట్లు గెలవడం ఖాయం. ఎన్నికల్లో కలిసి పనిచేస్తాం’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల కోసం అధికార కూటమిలోని ప్రతి ఒక్కరూ విభేదాలు మరచి ఐక్యంగా పని చేయాలని సూచించారు. చీలికలు సృష్టించడం లేదా ఏ వర్గాన్ని దెబ్బతీసేలా ప్రకటనలు చేయొద్దని తన మద్దతుదారులను కోరారు. మోడీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కాగా, రాష్ట్రంలోని అధికార కూటమిలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, ఎన్సీపీలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed