Waqf Board : ‘వక్ఫ్ బిల్లు’పై జేపీసీని ఆశ్రయించిన 600 క్రైస్తవ కుటుంబాలు

by Hajipasha |
Waqf Board : ‘వక్ఫ్ బిల్లు’పై జేపీసీని ఆశ్రయించిన 600 క్రైస్తవ కుటుంబాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై కేరళలోని కొచ్చి నగర శివార్లలోని చేరై గ్రామానికి చెందిన దాదాపు 600 క్రైస్తవ కుటుంబాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఆశ్రయించాయి. తమ ఆస్తులను కూడా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంటోందని ఆ కుటుంబాలు ఆరోపించాయి. ఈ క్రైస్తవ కుటుంబాల వాణిని వినిపిస్తూ కేరళలోని సైరో మలబార్ చర్చ్, కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్‌లు సవివరమైన లేఖను జేపీసీకి పంపించాయి. వాటిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.

వక్ఫ్ భూముల అంశం దేశంలోని అన్ని వర్గాల ప్రజలనూ ప్రభావితం చేస్తోంది అనేందుకు ఈ లేఖలే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై క్రైస్తవ వర్గం అభ్యంతరాలను కూడా జేపీసీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా మునాంబం గ్రామం పరిధిలోని క్రైస్తవుల ఆస్తులనూ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తోందని జేపీసీకి క్రైస్తవ మతపెద్దలు పంపిన ఓ లేఖలో ప్రస్తావించారు. చేరై, మునాంబం గ్రామాల క్రైస్తవుల్లో అత్యధికులు మత్స్యకారులేనని, వాళ్లు దశాబ్దాలుగా ఆయా ఊళ్లలోనే నివసిస్తున్నారని పేర్కొన్నారు.

More News :

వక్ఫ్ పెత్తనం?! దిశ స్పెషల్​ ఎడిషన్​ 30-10-2024 11AM...ఒక్క నోటీసుతో తరాలనాటి భూముల హక్కులు గల్లంతు...రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో వక్ఫ్ గందరగోళం...సామాన్యుల భూమిపై వక్ఫ్‌కు పెత్తనమిచ్చిన ధరణి

Advertisement

Next Story

Most Viewed