గతేడాది 59,000 మంది భారతీయులకు యూఎస్ పౌరసత్వం: యూఎస్‌సీఐఎస్ నివేదిక

by samatah |
గతేడాది 59,000 మంది భారతీయులకు యూఎస్ పౌరసత్వం: యూఎస్‌సీఐఎస్ నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో: 2023లో 59,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించినట్టు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) నివేదికలో వెల్లడైంది. గతేడాది మొత్తంగా సుమారు 8.7లక్షల మంది విదేశీయులు యూఎస్ పౌరులుగా మారారని తెలిపింది. వారిలో అత్యథికంగా 1.1లక్ష మంది మెక్సికన్లు యూఎస్ పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో భారత్ 59000, పిలిప్పీన్స్ పౌరులు 44,800, డొమినికన్ రిపబ్లిక్ దేశానికి చెందిన పౌరులు 35,200 మంది ఉన్నట్టు యూఎస్‌సీఐఎస్ తెలిపింది. కొత్తగా పౌరత్వం పొందిన వారిలో 12.7శాతం మంది మెక్సికన్లు కాగా, 6.7శాతం భారతీయులున్నారు. కాగా, అమెరికా పౌరసత్వం పొందాలంటే కనీసం ఐదేళ్ల పాటు అక్కడ చట్టబద్దంగా నివాసముండాలి. అంతేగాక అమెరికన్ పౌరులను పెళ్లి చేసుకున్న విదేశీయులకు 3ఏళ్లకే పౌరసత్వం కల్పిస్తారు. అయితే ఈ ఏడాది ఎక్కువగా యూఎస్‌లో ఐదేళ్ల పాటు ఉన్న వారికే పౌరసత్వం కల్పించినట్టు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు 2020లో కొవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వీసా సంబంధిత చర్యలను నిలిపివేసిన అమెరికా తాజాగా వాటిని పునరుద్దరించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో వీసాకు ధరఖాస్తు చేసుకున్న భారతీయులు అపాయింట్ మెంట్ కోసం ఏడాది పాటు వేచి ఉండాల్సి వచ్చేది. అయితే గతేడాది నుంచి ఈ సమయం తగ్గినట్టు యూఎస్ ఎంబసీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed