Road Accidents: దేశంలో ప్రతి రోజు రోడ్డు ప్రమాదాల్లో 462 మంది దుర్మరణం..

by Shamantha N |
Road Accidents: దేశంలో ప్రతి రోజు రోడ్డు ప్రమాదాల్లో 462 మంది దుర్మరణం..
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో 2022లో రోజుకు కనీసం 462 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారని రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. దేశంలో రోజుకు కనీసం 1,264 రోడ్డు ప్రమాదాలు జరిగాయని పేర్కొంది. దేశంలో రోడ్డు ప్రమాదాలపై వెలువడిన వార్షిక నివేదిక మరణాలపై ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. 2022లో దాదాపు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. మృతుల్లో అధికంగా 25-35 సంవత్సరాల వయసు వాళ్లే. దాదాపు 42,671 మంది 25-35 మంది వారున్నారు. రాష్ట్రాల వారీగా తమిళనాడులో అత్యధికంగా 64,105 రోడ్డు ప్రమాదాలు జరగగా.. ఉత్తరప్రదేశ్‌లో 22,595 రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి. తమిళనాడు తర్వాత మధ్యప్రదేశ్ (54,432), కేరళ (43,910), ఉత్తరప్రదేశ్ (41,746)లలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా రోడ్డు ప్రమాదాల వల్ల తమిళనాడులో 17,884 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 15,224, మధ్యప్రదేశ్‌లో 13,427 మరణాలు సంభవించాయి.

గతసారితో పోలిస్తే పెరిగిన ప్రమాదాలు

2021తో పోలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. దీంతో మరణాలు 9 శాతం పెరిగాయి. 2022లో మొత్తం రోడ్డు ప్రమాదాల సంఖ్య 4.61 లక్షలు కాగా.. 2021లో 4.12 లక్షలుగా ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం, 2022లో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారిలో 9,528 మంది మైనర్లే ఉన్నారు. 2021లో 7,764 మంది మైనర్లు చనిపోయారు. ఇకపోతే, భారతదేశంలో 2018లో రోడ్డు ప్రమాదాల సంఖ్య అత్యధికంగా 4, 70,403గా ఉంది. 2019లో ఆ సంఖ్య 4,56,959కి తగ్గింది. 2020లో 3,72,181కి మరింత తగ్గింది. కాగా.. 2021లో 4,12,432కి పెరిగింది. ఆ తర్వాత 2022లో 4,61,312కి పెరిగింది. 2022లో లక్షద్వీప్ అత్యల్పంగా కేవలం 3 రోడ్డు ప్రమాదాలు జరిగగా.. వాటి వల్ల కేవలం రెండు మరణాలే జరిగాయి. కాగా.. రవాణాశాఖ నివేదిక ప్రకారం 2023లో రోడ్డు ప్రమాదాలు అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ చట్టాలు పాటించకపోవడం వల్లే జరిగినట్లు తెలిపింది.

Next Story