Tesla crash: ‘టెస్లా’ కార్లు క్రాష్ అయి ఘోర ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి

by Shamantha N |
Tesla crash: ‘టెస్లా’ కార్లు క్రాష్ అయి ఘోర ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలో ‘టెస్లా’ కార్లు క్రాష్ అయి ఘోర ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో నలుగురు భారతీయులు చనిపోయారు. టొరంటో సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత కారు డివైడర్‌ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. అయితే, కారులోని వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు.. ఆ సమయంలో టెస్లా సెల్ఫ్ డ్రైవ్ మోడ్‌లో ఉందా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

గుజరాత్ కు చెందిన ఇద్దరు యువకులు

మరణించిన వారిలో గుజరాత్‌లోని గోద్రాకు చెందిన 30 ఏళ్ల కేతా గోహిల్, 26 ఏళ్ల నిల్ గోహిల్ ఉన్నారు. వారితో పాటు ఉన్న మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. అదే కారులో ప్రయాణిస్తున్న మరో యువతిని స్థానికులు కాపాడారు. కారు నుంచి బయటకు వచ్చి, వాహనదారుల సాయం కోరినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఆ యువతికి ప్రాణపాయం తప్పినట్లు అధికారుల తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పలువురు కారు అద్దాలను పగలగొట్టి సాయం చేసే ప్రయత్నం చేసినట్లు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed