Health Survey: దేశ ప్రజలకు బీపీ, షుగర్ ముప్పు!

by Nagaya |   ( Updated:2023-06-09 11:13:59.0  )
Health Survey: దేశ ప్రజలకు బీపీ, షుగర్ ముప్పు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ జనాభాలో 11.4 శాతం మంది మధుమేహం బారిన పడినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. మధుమేహం.. ఇతర సంక్రమించని వ్యాధుల బాధితుల సంఖ్య దేశంలో గతంలో అంచనా వేసిన దానికన్నా అధికంగా ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీఎంఆర్ తో కలిసి మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేకు సంబంధించిన నివేదికను ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్ నివేదికలో వెల్లడైంది. 2008-2020 మధ్య దేశవ్యాప్తంగా 1.1 లక్షల మందిపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించగా ఇందులో దేశ జనాభలో 15.3 శాతం మంది ప్రజలు ప్రి-డయాబెటిస్ స్థితికి చేరారని, 28.6 శాతం మంది ప్రజలు సాధారణ ఊబకాయం, 39.5 శాతం ప్రజలు ఉదర సంబంధిత ఊబకాయంతో బాధ పడుతున్నట్లు తేలింది. అలాగే 35.5 శాతం మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. కాగా 81.2 శాతం ప్రజల్లో డిస్ లిపిడేమియా సమస్యను గుర్తించారు. అన్ని రాష్ట్రాల జనాభా, భౌగోళిక పరిస్థితులు, సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని దశల వారీగా ఈ అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నందున అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచించారు.

Read more:

ఉలవలు తినటం వలన ఎన్ని ప్రయోజనాలో..

ఉదయాన్నే ఇడ్లీ , దోశ టిఫిన్ తినేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవంట

Advertisement

Next Story

Most Viewed