దారుణం : ఆసుపత్రుల్లో 300 మంది రోగులు దారుణ హత్య?

by samatah |
దారుణం : ఆసుపత్రుల్లో 300 మంది రోగులు దారుణ హత్య?
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఆసుపత్రుల్లో దాదాపు పదేళ్లుగా 300 మంది రోగులను విషపు మందు ఇచ్చి హత్య చేసినట్లు మోహన్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.ఆయన వీడియోలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శవాగారంలో వద్ద పని చేస్తున్నాడు. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబసభ్యులు, బందు వుల కోరిక మేరకు సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు, దీనికి రూ.5 వేలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ కావడంతో, వెంటనే అలర్టైన పోలీసులు నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్ రాజ్‌ను అరెస్ట్ చేశారు.

కాగా, పోలీసుల దర్యాప్తులో మద్యం మత్తులో తాను అలా మాట్లాడినట్లు సమాచారం. ఇక మోహన్ రాజ్ పై విషయం పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

Next Story